బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (22:52 IST)

ఐటీ కమిషనర్‌గా హోంమంత్రి సుచరిత భర్త

రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌ విజయవాడ ఆదాయపు పన్ను కమిషనర్‌ (టీడీఎ్‌స)గా బాధ్యతలు చేపట్టారు.

1992 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి దయాసాగర్‌ గతంలో ముంబై, హైదరాబాద్‌ల్లో ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.

విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ వినోద్‌ కన్నన్‌, విశాఖపట్నం జాయింట్‌ కమిషనర్‌ శంకర్‌, విశాఖ డిప్యూటీ కమిషనర్‌ చింతపల్లి మెహర్‌చాంద్‌, విజయవాడ ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ (హెడ్‌క్వార్టర్స్‌) దుర్గాభవానీ.. కొత్త కమిషనర్‌ దయాసాగర్‌కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.