గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 అక్టోబరు 2021 (11:44 IST)

మహారాష్ట్ర హోం మంత్రికి కరోనా పాజిటివ్

మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్‌కు కరోనా వైరస్ సోకింది. గత రెండు రోజులుగా ఆయనలో స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌ వచ్చిందని పాటిల్‌ తెలిపారు. 
 
ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా తీసుకుంటున్నానని చెప్పారు. నాగపూర్‌, అమరావతి పర్యటన సందర్భంగా తనపాటు పాల్గొన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని దిలీప్ సూచించారు.