గురువారం, 24 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జులై 2025 (20:17 IST)

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

pawan kalyan
తన పేరు పవన్ కళ్యాణ్ అని తాను అన్ని చోట్లా ఉంటానని సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. తాను నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం గురువారం విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని బుధవారం విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తనకు విశాఖతో మంచి అనుబంధం ఉందన్నారు. 
 
ఇదే విషయాన్ని చెబితే "పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను. అక్కడే పెరిగాను అంటాడు" అని అంటూ కొందరు విమర్శిస్తుంటారని వాళ్లంతా కూపస్థమండూకాలని, అంతకు మించి ఆలోచించలేరని చురకలంటించారు. తన పేరే పవన్ అని గుర్తు చేసిన ఆయన... తాను అంతటా ఉంటాని చెప్పారు. 
 
విశాఖతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. నటనలో ఓనమాలు ఇక్కడే నేర్చుకున్నట్టు చెప్పారు. తన గురువు సత్యానంద్ ఉత్తరాంధ్ర ఆటాపాట నా గుండెల్లో అణువణువునా నింపేశారన్నారు. ఆయన వద్ద నటన కాదు.. ధైర్యంగా ఎలా ఉండాలో నేర్చుకున్నట్టు చెప్పారు. ఆయన నాకు జీవిత పాఠాలు నేర్పించారన్నారు. 
 
చిన్నప్పటి నుంచి నాకు కోరికలు లేవన్నారు. అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలని అనిపించేది. సినిమాలు చేయాలని డబ్బులు సంపాదించాలని ఎపుడూ అనుకోలేదన్నారు. ఒక అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నపుడు ధైర్యంగా చెప్పాలని సత్యానంద్ నేర్పించారన్నారు.