1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (10:06 IST)

2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా

గతేడాది ఏప్రిల్‌ నుంచి దేశంలో 10 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 106 మంది హైకోర్టు జడ్జిలు (దాదాపు 15 శాతం మంది జడ్జిలు) కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అలాగే, దేశ వ్యాప్తంగా మొత్తం 18000 వేల సిబ్బందిలో 2,768 మంది జ్యుడీషియల్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తెలిపారు. 
 
కాగా, కరోనా మహమ్మారి ఈ విధంగా దెబ్బకొడుతున్నప్పటికీ మూడెంచల జ్యుడిషియల్‌ వ్యవస్థ కొనసాగిందని చెప్పారు. కోవిడ్‌ కారణంగా తాము తమ ముగ్గురు అధికారులను కోల్పోయామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సుప్రీంకోర్టు విచారణలు జరుపుతోన్న సంగతి తెలిసిందే.