త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అరవింద్‌లకు కరోనా పాజిటివ్??
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు వరుసగా కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడి కోలుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఇద్దరు సెలెబ్రిటీలు ఈ వైరస్ బారినపడినట్టు వార్తలు వస్తున్నాయి. వారు ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఉన్నారు.
ప్రస్తుతం వీరు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. అయితే దీనిపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. ఇప్పటికే ఈ నెల 9న విడుదల కావాల్సిన 'వకీల్‌సాబ్' చిత్రంలో కీలక పాత్రను పోషించిన హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా సోకిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది కూడా. ఈ కారణంగా నివేదా థామస్ 'వకీల్ సాబ్' ప్రమోషన్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.