గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (16:37 IST)

ఉగాదికి ఎన్‌.టి.ఆర్‌. కొత్త సినిమా షురూ!

Ramarao, Trivikram
మీ రామారావు.. అంటూ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు ప్రోగ్రాంలో త‌న పేరును ఇకపై ఇలా పిల‌వాల‌నే అన్న‌ట్లు సూచాయ‌గా ఎన్‌.టి.ఆర్‌. చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది. ఇదిలా వుండ‌గా, రామారావు న‌టిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాతో మూడేళ్ళు ప‌ట్టింది. దాదాపు ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన ఈ సినిమాను దాటి మ‌రో సినిమా చేయ‌డానికి వీలులేదు. స‌హ‌జంగా ఆ సినిమా త‌ర్వాత రెస్ట్ తీసుకునే అల‌వాటున్న రామారావుకు క‌రోనా వ‌ల్ల వున్న రెస్ట్ చాలు అన్న‌ట్లుగా అయింది. ఇప్పుడు టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాడు.

ఇక ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ క‌థ ప‌ట్టుకుని రామారావు కోసం చాలా కాలం ఎదురుచూశారు. ఆ సినిమాకు సెట్‌కు వెళ్ళే టైం వచ్చింది. ఇక లాభంలేద‌ని వ‌చ్చేనెల ఉగాదికి ఆ సినిమా ప్ర‌క‌ట చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమాకు రాజ‌మౌళి ముఖ్య అతిథి వ‌చ్చి క్లాప్ కొట్ట‌బోతున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్ క‌థ‌నాలు చెబుతున్నాయి. మేల‌లో షూటింగ్ రెగ్యుల‌ర్ కానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని బేన‌ర్లో బేన‌ర్లో నిర్మించ‌నున్నారు. డిసెంబ‌రు క‌ల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి కొత్త ఏడాదిలో ప్ర‌శాంత్ నీల్ సినిమాను మొద‌లు పెట్టాల‌ని రామారావు భావిస్తున్నాడు.