ప్ర‌భాస్‌, అనుష్క క‌లుస్తున్నారా!

Prabhas, Anuksha
డివి| Last Updated: శనివారం, 20 ఫిబ్రవరి 2021 (16:36 IST)
Prabhas, Anushka
ప్ర‌భాస్‌, అంటే ఇద్ద‌రి కాంబినేష‌న్ క్రేజీగా వుంటుంది. వీరి గురించి టాలీవుడ్‌లో మంచి బ‌జ్ కూడా క్రియేట్ అవుతుంది. ప్ర‌భాస్ వ‌రుస‌గా సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం విరామం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎక్క‌డా ఆమె గురించి వార్త‌లు కానీ ఫొటోలు కానీ బ‌య‌ట‌కు రావ‌డంలేదు. కానీ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం అనుష్క మ‌ర‌లా భారీ బేన‌ర్‌లో న‌టించ‌నుంది.

ఇదివ‌ర‌కు ఫొటో సెషన్ కూడా జ‌రిగిందని తెలుస్తోంది. ప్ర‌భాస్‌, అనుష్క మిర్చి కాంబినేష‌న్ అంద‌రికీ తెలిసిందే. సూప‌ర్ డూప‌ర్ హిట్‌. అంత‌టి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. నిర్మాణం మాతృ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం మైత్రీ మూవీ మేక‌ర్స్ వ‌రుస‌గా ఆరు సినిమాలు లైన్‌లో వున్నాయి. అందులో ప్ర‌భాస్ సినిమా ఒక‌టి. దానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌నే. ఈసారి త‌ప్ప‌కుండా పాన్ ఇండియా మూవీగా తీయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ‌రింత క్రేజ్ రావాలంటే హీరోయిన్ ఎవ‌ర‌నేది చ‌ర్చ జ‌రిగింది.

గ‌త కొద్దిరోజులు ప‌లువురు హీరోయిన్ల‌ను ప‌రిశీలించినా ఫైన‌ల్‌గా అనుష్క ద‌గ్గ‌ర‌కే చిత్ర యూనిట్ ఆగిపోతుంది. అందుకే మ‌రోసారి అనుష్క‌తో ప్ర‌భాస్ జోడీ క‌నువిందు వుంటుంద‌ని స‌న్నిహితులు చెబుతున్నారు. ఇక వీరిద్ద‌రు బాహుబ‌లి గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. పైగా మ‌రోసారి వీరి కాంబినేష‌న్‌కు ఓ కార‌ణ‌ముంది.

అదేమంటే ప్ర‌భాస్‌కు 25వ సినిమాగా మైత్రీమూవీస్ బేన‌ర్‌లో రావ‌డం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం అందుకే అనుష్క పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ విష‌యం అధికారికంగా తెలియాల్సివుంది. ఇప్పటికే ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా పూర్తీ కావొచ్చింది. దాంతో పాటు కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ కూడా ఓ షెడ్యూల్ పూర్తీ చేసింది. అలాగే ఆది పురుష్ కూడా సెట్స్ పైనే ఉంది.దీనిపై మరింత చదవండి :