మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డివి
Last Updated : శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:14 IST)

ఆదిపురుష్‌ను వాయిదా వేసిన ప్ర‌భాస్‌

Prabhas adipurush
ప్ర‌భాస్ సినిమాలు చ‌క‌చ‌క‌గా షూటింగ్‌లో వున్నాయి. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి జ‌రుగుతున్నాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్‌, స‌లార్ సినిమాలలో బిజీగా వున్నాడు. ఇటీవ‌లే ఆదిపురుష్ సినిమా సెట్‌పైకి వెళ్లింది. అయితే మొద‌టి రోజే సెట్లో అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో వాయిదా ప‌డింది. భారీగా న‌ష్టంతోపాటు సెట్ రూపు రేఖ‌లు మారిపోయాయి. అందుకే దానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. అందులోని ప‌రిక‌రాల‌ను విదేశాల‌నుంచి తెప్పించాల్సి వుంది.

క‌నుక ఆ చిత్రాన్ని వాయిదా వేశాడు ప్ర‌భాస్‌. ఇందులో శ్రీ‌రాముడి పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తున్నాడు. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కాగా, ప్ర‌స్తుతం ఆ డేట్స్‌ను `స‌లార్‌` సినిమాకు ఉప‌యోగించుకోన్న‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకే స‌లార్ షూటింగ్ ముందు అనుకున్న‌ట్లుగాకుండా ఎర్లీగా జ‌రుగుతోంది. విడుద‌ల తేదీ కూడా మారుతుందేమో చూడాలి.