గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (17:07 IST)

కర్నాటకలో భర్తను చంపిన భార్య - ప్రియుడితో పరార్

కర్నాటక రాష్ట్రంలో కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసిపారిపోయినప్పటికీ పోలీసులు గాలించి అరెస్టు చేసారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,  
 
కర్ణాటక రాష్ట్రంలోని డెంకణీకోట సమీపంలోని ఉణిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప (37) అనే వ్యక్తి టెంపో డ్రైవర్‌గా పనిచేస్తుంటే, ఈయనకు భార్య రూప (25), ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయ్యప్ప బంధువు తంగమణి (20) జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో ఉండగా, ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
మూడు నెలల క్రితం ఇద్దరూ ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. 10 రోజుల క్రితం బంధువులు వారిని పట్టుకుని ఎవరి ఇళ్లకు వారి పంపారు. మర్యాద పోయిందని అయ్యప్ప రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినా బయటపడ్డాడు. ఇదే అదనుగా రూప, తంగమణితో కలిసి భర్తను చంపాలనుకుంది. 
 
శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అయ్యప్పను ఇద్దరూ కలిసి గొంతు పిసికి చంపారు. ఉదయాన్నే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని రూప విలపించసాగింది. డెంకణీకోట పోలీసులు అనుమానంతో రూప, తంగమణిలను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇరువురిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. తండ్రి హత్య, తల్లి జైలుకు పోవడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు.