గురువారం, 8 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 జనవరి 2026 (19:43 IST)

మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందా?

Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి ఆపరేషన్ జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఆయన గత కొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 12వ తేదీన విడుదలకానున్న "మన శంకర వరప్రసాద్ గారు" మూవీ నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి స్పందించారు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వారు స్పందించారు. 
 
'దీనిపై ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్‌ చేయను' అంటూ సుస్మిత సమాధానం దాటవేశారు. బుధవారం జరిగే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో పాటు, సినిమా ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేశ్‌ ఇద్దరూ హాజరవుతారని వెల్లడించారు.
 
చిరంజీవికి ఇటీవల సర్జరీ జరిగిందట నిజమేనా? అని అడగ్గా, సుస్మిత పైవిధంగా స్పందించారు. 'చిరంజీవి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్‌ అభిమానులతో వీడియో కాల్స్‌ కూడా మాట్లాడుతున్నారు. ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తారు. గతంతో పోలిస్తే ఆయన ఫిట్నెస్‌ పెంచారు. అందుకే స్క్రీన్‌పై స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్‌ ఉంటే ఆ మూడ్‌లోనే ఉంటారు. ఆయనలో కొత్త ఉత్సాహాన్ని ఈ సినిమాలో చూస్తారు' అని అన్నారు. 
 
కాగా, చిరంజీవికి ఇటీవ‌ల ఓ చిన్న స‌ర్జ‌రీ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆయ‌న కొంత‌కాలంగా మోకాలి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారని, 'మ‌న శంక‌ర వ‌రప్ర‌సాద్ గారు' మూవీ బాధ‌ని కూడా ఓర్చుకొని షూటింగ్ పూర్తి చేసిన‌ట్టు రాసుకొచ్చారు. ఈ వార్తలతో చిరు అభిమానులు కాస్త ఆందోళనకు గురయయ్యారు. ఇప్పుడు ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొంటారని నిర్మాతలు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.