గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (10:40 IST)

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా నెగటివ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆయనకు నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం వరకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ విజయ వాడ చేరు కోన్నారని ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  
 
కాగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందారు. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. 
 
అలాగే ఆయనకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దీంతో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం వరకు రాజ్ భవన్‌కు చేరుకుంటారు.