సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (16:55 IST)

బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో వస్తాం... జగన్

ఏపీలో మూడు రాజధానుల బిల్లు రద్దుపై  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటూనే.. పూర్తి మార్పులతో మళ్లీ సభ ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలున్న విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేశామన్నారు. 
 
విశాఖలో సుందరీకరణ, రోడ్లు, ఇతర చిన్నచిన్న అభివృద్ధి పనులు చేపడితే ఐదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవాలను గుర్తించి రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాకపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపియల్ పెట్టాలని.. అమరావతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చందుకు శాసన రాజధాని ఏర్పాటు చేయాలని.. కర్నూలు ప్రజల త్యాగాన్ని, ఆకాంక్షలను గుర్తించి న్యాయ రాజధాని ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే తపనతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. 
 
2014లో రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని జగన్ అన్నారు. అప్పట్లో అన్ని నివేదికలను ఉల్లంఘించి రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. హైదరాబాద్ వంటి సూపర్ క్యాపిటల్ మోడల్ వద్దేవద్దని అలాంటి చారిత్రాత్మక తప్పుకు పాల్పడవద్దని ప్రజాతీర్పుతో స్పష్టమైందని జగన్ అన్నారు.