సోమవారం, 24 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : గురువారం, 9 అక్టోబరు 2025 (17:09 IST)

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

Puri Jagannath, Charmi Kaur, Harshavardhan Rameshwar
Puri Jagannath, Charmi Kaur, Harshavardhan Rameshwar
డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్‌ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
 
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి చిత్రాలతో పాపులరైన జాతీయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ  చిత్రానికి సంగీతం అందించనున్నారని మేకర్స్ ప్రకటించారు. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్ కలగలిసిన న్యూ జనరేషన్ మ్యూజిక్ ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. టబు,విజయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ హిలేరియస్ పాత్రల్లో కనిపించనున్నారు.
 
ప్రధాన నటీనటులు పాల్గొనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.