శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (10:20 IST)

దూసుకొస్తున్న మరో అల్పపీడనం... ఏపీపై ప్రభావం ఉంటుందా?

మరో అల్పపీడనం దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది శ్రీలంతో పాటు దక్షిణ తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 
 
ఈ అల్పపీడనం కారణంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని కోస్తాతీర ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. 
 
అయితే, తమిళనాడుపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.