ఏపీ అసెంబ్లీ సమావేశాల కుదింపు.. నేటితో స్వస్తి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగించనున్నారు. ఈ నిర్ణయానికి కూడా మండలిలో ఆమోదముద్రపడిత నేటితో సమావేశాలు ఆఖరు కానున్నాయి. నిజానికి ఈ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు జరిపేలా ప్లాన్ చేశారు. కానీ, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలన్న కుంటి సాకుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలావుంటే, ఈ సమావేశాల్లో 23 బిల్లులను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 12 బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిని మంగళవారం సభలో ఆమోదించుకోవడంతో పాటు.. కొత్తగా మరో 11 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుల ఆమోదంలో ఏదేని సాంకేతిక ఏర్పడిన పక్షంలో మరో రోజు అంటే బుధవారం వరకు పొడగించే అవకాశం ఉంది. అలాగే, వచ్చే నెలలో కూడా ఐదు రోజుల పాటు అసెంబ్లీని సమావేశపరచాలని ప్రభుత్వం భావిస్తోంది.