గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 నవంబరు 2021 (08:12 IST)

ఏపీ రాష్ట్ర గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత.. ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తరలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను విమానంలో హైదరాబాద్ నగరానికి తరలించారు. ఇటీవల అస్వస్థతకు లోనైన ఆయన్ను హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడు ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ వైద్య నుంచి కోలుకున్న ఆయన ఇటీవలే విజయవాడకు వచ్చారు. ఇంతలోనే మళ్లీ ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మళ్లీ హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఏఐజీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి ఈ నెల 15వ తేదీన ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో 17వ తేదీన అత్యవసరంగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స అనంతరం ఈ నెల 23వ తేదీన డిశ్చార్జ్ చేశారు. అయితే, గత రాత్రి మరోమారు ఆయన అస్వస్థతకు లోనుకావడంతో రాజ్‌భవన్ వర్గాలు వెంటనే ఏఐజీ ఆస్పత్రి వర్గాలను సంప్రదించగా, ఆయనకు అదనపు చికిత్స అవసరమని చెప్పడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నగరానికి తరలించారు.