1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (11:43 IST)

వైఎస్ఆర్ పెన్షన్ కానుక షురూ.. రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవచ్చు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. స్వగ్రామాలకు దూరంగా ఉంటూ పెన్షన్ సాయాన్ని కోల్పోతున్నవారికి మంచి అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. 
 
కానీ లబ్ధిదారులు ఏనెలైనా పెన్షన్ తీసుకోకుంటే.. ఆ తర్వాతి నెలలో రెండూ కలిపి ఇచ్చే వెసులుబాటును తొలగించింది. లబ్ధిదారులంతా నెలనెలా కచ్చితంగా పెన్షన్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేస్తున్నారు. నెలనెలా దాదాపు 95శాతం మందికి పెన్షన్లు ఇంటివద్దే అందుతున్నాయి. వేలిముద్రలు పడకపోవడం, లబ్ధిదారులు ఇళ్లవద్ద లేకపోవడంతో అలాంటి వారికి మాత్రం సాయం అందడం లేదు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ మాదిరిగానే పెన్షన్ కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. 
 
పెన్షన్ పోర్టబిలిటీకి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలని సెర్ప్ సీఈఓ.. డీఆర్డీఏ ప్రాజెక్ట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని కార్యాలయాలకు ఆదేశాలను జారీ చేశారు. త్వరలోనే పెన్షన్ పోర్టబిలిటీ ప్రారంభం కానుంది.  
 
వైఎస్ఆర్ పెన్షన్ కానుకా కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి పెన్షన్ల పంపిణీ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ప్రతి నెలా మొదటి రోజు లబ్ధిదారులకు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక, గ్రామ వాలంటీర్లు తెల్లవారుజాము నుండి పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 60,50,650 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించబడతాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం గ్రామ, వార్డు సెక్రటేరియట్ ఖాతాల్లో రూ.1,411.42 కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపారు.
 
సాంకేతిక కారణాల వల్ల ఎవరికీ పెన్షన్ అందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ వాలంటీర్లు ఇప్పటివరకు ఉదయం 7 గంటల వరకు 14.24 లక్షల మంది పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేశారు.