శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (16:27 IST)

పేదలందరికీ ఇళ్లు... ఏపీ సర్కారుకు బిగ్ రిలీఫ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలపెట్టిన పేదలందరికీ ఇళ్లు పథకంపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దీంతో ఏపీలో పేదలందరికీ ఇల్లు నిర్మించేందుకు లైన్ క్లియర్ అయినట్టే. 
 
రాష్ట్రంలో ఇళ్లులేని పేదలు ఉండరాదన్న ప్రధాన ఉద్దేశంతో ఏపీ సర్కారు పేదలందరికీ ఇళ్లు నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ గత నెల 8వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై హైకోర్టు బెంచ్‌కు ప్రభుత్వం అప్పీల్ చేసింది. 
 
ఈ తీర్పుపై ఏపీ సర్కారు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేశారు. దీంతో ఈ పథకాన్ని ప్రభుత్వం యధావిధిగా కొనసాగించనుంది.