శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (12:41 IST)

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం : హీరో అబ్బవరం సోదరుడు మృతి

తెలుగు చిత్రపరిశ్రమలో వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా వైరస్ సోకి మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మంగళవారం ఊపిరితిత్తుల కేన్సర్‌ కారణంగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం చెందారు. ఇపుడు మరో విషాదకర ఘటన జరిగింది. 
 
"ఎస్ఆర్ కళ్యాణ మండపం" చిత్రంలో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రాంరాజులు రెడ్డి ఒక రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాంరాజులును సమీపంలోని ఆస్పత్రికి తరలించగా ఆయన అక్కడ చనిపోయినట్టు సమాచారం. కాగా, అబ్బవరం రాంరాజులు రెడ్డి సంబేపల్లి మండలం దుద్యాల గ్రామంలో నివాసం ఉంటున్నారు.