శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (14:48 IST)

ముగిసిన శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు - పాడె మోసిన ఓంకార్ బ్రదర్స్

ఇటీవల కరోనా వైరస్ బారినపడి మృత్యువాతపడిన సినీ నృత్యదర్శకుడు శివశంకర్ మాస్టర్ అత్యంక్రియలు సోమవారం ముగిశాయి. హైదరాబాద్, పంజాగుట్టలోని మహాప్రస్థానంలో ఈ అంత్యక్రియలను పూర్తిచేశారు. ఈ అంత్యక్రియల్లో ఓంకార్ సోదరులైన ఓంకార్, అశ్విన్‌లు పాల్గొని శివశంకర్ మాస్టర్ పాడెను మోశారు. 
 
ఓంకార్‌కు శివశంకర్ మాస్టారుతో ప్రత్యేక అనుబంధం వుంది. 'ఆట' డ్యాన్స్ షోతో వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దీంతో యాంకర్ ఓంకార్ ఈ అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఇందులో ఓంకార్ సోదరుడు అశ్విన్ కూడా పాల్గొని ఆయన పాడె మోశారు. 
 
కాగా, శివశంకర్ మాస్టార్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, ఆయన భార్య కూడా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆయన చిన్నకుమారుడు అజయ్ కృష్ణ శివశంకర్ మాస్టార్‌కు అంత్యక్రియలు పూర్తిచేశారు.