మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 16 అక్టోబరు 2021 (15:12 IST)

ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల...ఎర్ర జెండా క‌ప్పి...

మావోయిస్టు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్కే చ‌నిపోయిన‌ట్లు పార్టీ ప్ర‌కటించింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు కూడా నిర్వ‌హించింది. ఆ ఫోటోల‌ను మీడియాకు విడుద‌ల చేశారు. పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు జ‌రిగాయి.


నిన్నమధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు ఆర్కేకు ఆఖ‌రి లాల్ స‌లాం చేశార‌ని, మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి మావోయిస్టులు అగ్ర నేత‌లు నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు.