ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (09:00 IST)

మద్యం మత్తులో తమ్ముడిని చంపేసిన అన్న... ఎక్కడ?

తెలంగాణా రాష్ట్రంలోని పాలమూరు మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లి మండలంలో దారుణం జరిగింది. మండలంలోని రేపోనిలో మద్యం మత్తులో తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపేశాడో అన్న. 
 
ఈ గ్రామానికి చెందిన వెంకన్న, గంగయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు. గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. అయితే ఇద్దరిమధ్య చెలరేగిన వివాదం పెద్దదిగా మారింది. 
 
దీంతో మద్యంమత్తులో ఉన్న వెంకన్న ఆవేశంతో చేతికందిన గొడ్డలితో గంగయ్యని నరికాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ హత్యపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.