శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 నవంబరు 2021 (23:13 IST)

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో కోవిడ్.. టీచర్లు, విద్యార్థులకు...

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపింది.

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ఎస్టీ బాలికల పాఠశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. 
 
పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు ఉపాధ్యాయులు మహమ్మారి బారిన పడ్డారు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పిల్లలను స్కూళ్లకు పంపాలంటే భయపడుతున్నారు. వీరికి కరోనా ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది.