తెలంగాణ ఫిలించాంబర్ ఎన్నికలు ఏకగ్రీవం వైపు అడుగులు
Kvl. Narasimha Rao, Pratani Ramakrishna Goud
తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా, కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టిఎఫ్‌సిసి) గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికులతో, 800 ప్రొడ్యూసర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. ఇప్పటివరకు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాతలకు అత్యంత సులువుగా ప్రాసెస్ జరిపే సంస్థగా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. కాగా తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు నవంబర్ 14న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం విత్ డ్రాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికలు లేకుండా ఏకగ్రీవ ఎన్నికకు ప్రతాని రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి కేవియల్ నరసింహారావు (ఎల్ ఎల్ బి) మాట్లాడుతూ, తెలంగాణ ఫిలించాంబర్ ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన వారు దాదాపు 50 మంది ఉన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులైన ప్రతాని రామకృష్ణ మరొకసారి ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే వైస్ ఛైర్మన్ గా ఏ.గురురాజ్, జనరల్ సెక్రటరీగా లయస్ సాయి వెంకట్ వీరితో పాటు ఈసీ మెంబర్లు అంతా కలిసి దాదాపు 50 మంది నామినేషన్లు వేశారు. ప్రస్తుతం విత్ డ్రాలు జరుగుతున్నాయి. రేపటి వరకు విత్ డ్రాలు జరుగుతాయి.
మరోవైపు నామినేషన్ల స్క్రూటినీ కూడా జరుగుతోంది. అలాగే ప్రతాని రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడేళ్లలో తెలంగాణ ఫిలించాంబర్ లో పదివేల మంది సభ్యులుగా చేరారు. వీరందర్నీ కో-ఆర్డినేట్ చేస్తూ ప్రతాని రామకృష్ణ గారు ఎలక్షన్స్ లేకుండా యునానిమస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నారు.