గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వసుంధర
Last Modified: ఆదివారం, 10 అక్టోబరు 2021 (13:43 IST)

మా ఎన్నికలు: ఓటు వేసిన మెగాస్టార్ చిరంజీవి, సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు

మా ఎన్నికల పోరు ఏ విధంగా సాగుతుందో తెలిసిందే. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు ఇద్దరూ పోటీలో విజయం సాధించడానికి వారి వారి ప్రయత్నాలు చేసుకున్నారు.
 
మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఆ తర్వాత లేఖరులతో మాట్లాడుతూ, 'నేను నా మనస్సాక్షి ప్రకారం ఓటు వేశాను. విషయాలు అన్ని వేళలా ఒకేలా ఉండవు. ఎన్నికలు ఎల్లవేళలా చేదుగా ఉంటాయని నేను అనుకోను. భవిష్యత్తులో మా ఎన్నికలను ఏకగ్రీవంగా మార్చడానికి మేము మా ప్రయత్నాలను కొనసాగిస్తాము.
 
"ఓట్లు వేయని మా సభ్యుల మనస్సాక్షికి వదిలివేస్తున్నాను. కొందరు షూటింగ్‌లో బిజీగా ఉండవచ్చు. కానీ వారి నిర్ణయం గురించి వివరించడానికి నేను ఇష్టపడను '. కాగా మా ప్రెసిడెంట్ పదవికి ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వానికి చిరంజీవి మద్దతు ఇస్తున్నట్లు పుకార్లు రేగిన సంగతి తెలిసిందే.