శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 10 అక్టోబరు 2021 (11:18 IST)

మోహన్ బాబుకు ప్రకాష్ రాజ్ పాదాభివందనం.. నిన్న తిట్టుకున్నారు.. నేడు..?

maa elections
మా ఎన్నికల పోలింగ్  ప్రశాంతంగా ప్రారంభమైంది. నిన్నవరకు నువ్వా నేనా అన్నట్టుగా మొదలైన ఈ ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబు, మంచు విష్ణులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎదురుపడిన ప్రకాష్ రాజ్-మంచు విష్ణులు ఒకరిని ఒకరు హగ్ చేసుకున్నారు.
 
ఇక మోహన్ బాబుకు ప్రకాష్ రాజ్ పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. వారించిన మోహన్ బాబు భుజం తట్టి ఆశీర్వదించారు. తాజా మాజీ అధ్యక్షుడు నరేశ్ సైతం అక్కడే ఉండడం విశేషం. నిన్నటిదాకా బండ బూతులు తిట్టుకున్న ఈ రెండు గ్రూపులు ఈరోజు కలిసిపోయి హగ్ చేసుకోవడమే ఇక్కడ విశేషం అని చెప్పొచ్చు.
 
రెండు ప్యానళ్ల నుంచి పోటీచేస్తున్న సభ్యులు పోలింగ్‌ను సాధ్యమైనంత ఎక్కువ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు తుది ఫలితం వస్తుందని అంటున్నారు.
 
హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్ పబ్లిక్ స్కూలుకు ఓటు వేసేందుకు సినీ సెలబ్రెటీలు తరలివస్తున్నారు. ‘మా’లో మొత్తం 925 మంది సభ్యులున్నారు. వీరిలో 883మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు.