సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (12:42 IST)

ఆ దర్శకుడిని నిండా ముంచిన హీరో విష్ణు : నాగబాబు ఫైర్

నటుడు ప్రకాష్ రాజ్ అనేక మంది నిర్మాతలను మోసం చేశారంటూ హీరో మంచు విష్ణు చేస్తున్న ఆరోపణలపై మెగా బ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మంచు విష్ణు కూడా తక్కువేం తినలేదన్నారు. 'సలీమ్' సినిమా సమయంలో వైవీఎస్ చౌదరి రెమ్యునరేషన్ సమయంలో మీరు ఫ్రాడ్ చేయలేదా..? అయన కోర్టుకెక్కిన సంగతి మర్చిపోయారా..? కోర్టు మీకు మొట్టికాయలు వేసిందని తెలుగువాళ్ళకు తెలియదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
అయితే, వైవీఎస్ చౌదరి పెద్ద డైరెక్టర్ కావడం వల్లే ఎదురునిలవగలిగాడు. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని నాగబాబు అన్నారు. ఇక ప్రజలు 'ప్రకాష్ రాజ్‍‌ను తెలుగోడు అంటారు మంచు విష్ణును తెలుగు నేర్చుకో' అంటారు అని సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 
 
ఇదిలావుంటే, ప్రకాష్ రాజ్‌కు నాగబాబు బహిరంగ మద్దతు ప్రకటిస్తే, మంచు విష్ణు మాత్రం కృష్ణ, కృష్ణం రాజు, బాలకృష్ణ , కోట శ్రీనివాస్ రావు వంటి వారు మద్దతు కావాలని కోరుతూ వారిని కలిశారు. ఇక ప్రకాష్ రాజ్ తనకు ఎలాంటిపెద్దల సపోర్ట్ అవసరం లేదు అంటూ.. దూకుడుగా ముందుకు సాగుతుండటం గమనార్హం.