గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (22:28 IST)

మంచు వారింట విషాదం: మోహన్‌ బాబు సొంత తమ్ముడు మృతి

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్‌ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంచు మోహన్‌ బాబు సొంత తమ్ముడు రంగస్వామి నాయుడు మృతి చెందారు. తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.
 
రంగ స్వామి నాయుడు వయస్సు 63 సంవత్సరాలు ఉంటుందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రంగ స్వామి నాయుడు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగస్వామి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో తాజాగా ఆయన తుది శ్వాస విడిచారు. 
 
ఇక రంగస్వామి నాయుడు మృతి పట్ల పలుగురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం తిరుపతిలో జరుగనున్నాయి.