గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (20:54 IST)

ఆ పువ్వులు పవిత్రమే.. ఆ అగరవత్తులు శ్రీవారికి వాడితే ఎలా?

శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అలంకారం చేసినంతవరకు పువ్వులు పవిత్రమే.. కానీ ఒక్కసారి వాడిన పుష్పాలను పవిత్ర జలాలలో కలిపేయాలి. వాటిని భూమిలో కప్పివేయడం కానీ చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి వివరించారు. అలా కాదని వాడిపోయిన పువ్వులతో తయారు చేసిన అగరవత్తులను మళ్లీ స్వామివారికే ఉపయోగించడం సరైన విధానం కాదని స్పామి స్పష్టం చేశారు. 
 
ఇలాంటి వాటిని  శైవ, వైష్ణవ ఆగమ విధానాలు, పురాణాలు ఖండించాయని గుర్తు చేశారు.  ఇది అపరాధం కిందకే వస్తుందని.. దీనిపై ఎక్కడైనా, ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమేనని శ్రీనివాసానంద అన్నారు. 
 
టీటీడీ శాస్త్రవిరుద్ధ చర్యలకు పాల్పడితే తాము నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. టీటీడీ ఒక ధార్మిక సంస్థ మాత్రమేనని, టీటీడీ బోర్డు ఏర్పాటైంది వ్యాపారం చేయడానికి కాదని స్పష్టం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీసేలా టీటీడీ వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.