సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (10:01 IST)

తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం: 56 అంశాలపై చర్చ

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమలలో సామాన్య భక్తులు బస చేసే జీ. ఎన్.సి, ఏఎన్సీ, హెచ్.వీ.సి, మొదటి, రెండు, మూడవ సత్రాల్లో 25 లీటర్ల గీజర్ల ఏర్పాట్లపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. 
 
అంతేగాకుండా సుమారు 55 అంశాలను చర్చించి పాలకమండలి  పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రసాదాల తయారీలో ముడి సరుకుల కొనుగోళ్లకు ఆమోదం తెలపనున్నారు. టీటీడీ గోల్డ్ డిపాజిట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్బీఐకి మార్చే అంశంపై కూడా ఇవాళ చర్చించనున్నారు.
 
తిరుమలలో రింగ్ రోడ్ లోని సందీప్ రెస్టారెంట్ ను ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ సంస్థకు మూడేండ్ల‌ లీజ్ పొడిగింపుపై పాలకమండలి ఆమోదం తెలపనుంది. అదే విధంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ స‌మావేశంలో చర్చించనున్నారు.