గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (16:50 IST)

కేంద్ర కేబినేట్‌ ఎమర్జెన్సీ మీటింగ్.. బిపిన్ రావత్ ఆచూకీ కోసం?

Helicopter Crash
ఇండియన్‌ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాద ఘటనపై కేంద్ర కేబినేట్‌ ఎమర్జెన్సీ సమీక్ష సమావేశం నిర్వహిస్తోంది. కాసేపట్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులోని కూనూరు వద్ద ఇండియన్‌ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో సీడీయస్ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణీతో పాటు మరో ఏడుగురు వున్నట్లు తెలుస్తోంది. 
 
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్‌ రావత్‌ ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఘటన స్థలం వద్ద రెస్కూ సిబ్బంది ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించింది.