గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 డిశెంబరు 2021 (13:24 IST)

నీలగిరి జిల్లాలో కుప్పకూలిన హెలికాఫ్టర్ ... సిబ్బంది పరిస్థితి?

తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో భారత రక్షణ శాఖకు చెందిన ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ హెలికాఫ్టర్ కుప్పకూలిపోగానే మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో హెలికాఫ్టర్ మొత్తం కాలిపోయింది. అయితే, ఈ హెలికాఫ్టర్‌లో ఉన్న ఆర్మీ అధికారుల పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. 
 
బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జిల్లాలోని కున్నూరుకు సమీపంలోని కాట్టేరి అనే ప్రాంతంలో ఈ హెలికాఫ్టర్ కూలిపోయింది. ఈ జిల్లాలో దట్టమైన పొగమంచు అలుముకునివుంది. దీనికితోడు హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు సమాచారం. ఈ కారణంగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది.

అయితే, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు రక్షణ సిబ్బందిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.  మిగిలిన వారి పరిస్థితి తెలియాల్సివుంది. పైగా, ఈ ప్రమాదం సంభవించినపుడు హెలికాఫ్టర్‌లో ఎంత మంది ఉన్నారో తెలియాల్సివుంది.