శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (08:11 IST)

కథువా జిల్లాలో కూలిపోయిన హెలికాప్టర్.. పైలట్ దుర్మరణం

Kathua
జ‌మ్మూ-కాశ్మీర్ లోని కథువా జిల్లాలో భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోగా, దాన్ని నడిపిస్తున్న పైలట్ దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో పైలట్ ను స్థానిక సైనిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చామని సీనియర్ పోలీస్ ఆఫీసర్ శైలేంద్ర మిశ్రా తెలిపారు.
 
ఈ చాపర్ అత్యాధునిక తేలికపాటి హెలికాప్టర్ 'ధ్రువ' వేరియంట్ కు చెందినదని వెల్లడించారు. ఇది పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరిందని, కథువాకు సమీపంలోని లఖన్ పూర్ లో క్రాష్ ల్యాండింగ్ అయిందని తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై విచారణ జరుగుతోందని తెలిపారు.