శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (09:20 IST)

తెల్ల జుట్టుతో పెళ్లి పీటలపై దిలీప్ జోషి కుమార్తె నియతి.. ఫోటోలు వైరల్

బాలీవుడ్ నటుడు దిలీప్‌జోషి కుమార్తె నియతికి ఇటీవలే పెళ్లైంది. మూడు ముళ్లు వేయించుకున్న తన ముద్దుల కుమార్తె ఫొటోలను దిలీప్‌ తాజాగా ఇన్‌స్టాలో ఉంచారు. ఆ ఫోటోలు చూసి జనం షాకయ్యారు. ఆ ఫోటోల్లో తెల్ల జుట్టుతో ఉన్న నియతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యానికి జోహార్లు అంటూ ప్రశంసించడం మొదలుపెట్టారు. 
 
'ఆత్మవిశ్వాసమే అసలైన అందం. నీపై నీ నమ్మకాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం' అంటూ నెటిజన్లు పొగుడుతున్నారు. మామూలుగానే అమ్మాయిలు అందానికి, అందులో భాగమైన కురులకీ ప్రాధాన్యమిస్తారు. 
Niyathi
 
అయితే నియతి మాత్రం తన తెల్లని జుట్టును దాచే ప్రయత్నం చేయకుండా ధైర్యంగా పెళ్లిమండపంలోకి అడుగుపెట్టింది. ఆత్మస్థైర్యం తొణికిసలాడుతున్న కళ్లతో సంతోషంగా వరుడు యశోవర్ధన్‌తో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం నియతి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.