సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:28 IST)

పెళ్లికి తర్వాత అంతా మారిపోయింది.. కన్నీళ్లు రావడం ఆగిపోయాయి?

సింగర్ సునీత తన వైవాహిక జీవితం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం తర్వాత అన్నీ మారిపోయాయని.. కన్నీళ్లు ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. తన జీవితంలో తనకు నచ్చిన విధంగా బతకాలనున్నాని.. ప్రస్తుతం అలానే బతుకుతున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నానని తెలియజేశారు. 
 
ఇక ఈ ఏడాది జరిగిన కొన్ని విషాద ఘటనల పై స్పందిస్తూ సునీత ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా బాలు గారి మరణం తనని ఎంతగానో కలిచివేసిందని ఆయన మరణం తరువాత కన్నీళ్ళు రావడం కూడా ఆగిపోయాయని సునీత బాల సుబ్రహ్మణ్యం గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. 
 
ఆయన మరణం తర్వాత ఏం జరిగినా మహా అయితే బ్లాంక్‌ అయినట్లు అనిపిస్తుంది కానీ ఏ విషయం నన్ను కదిలించలేక పోయాయంటూ బాలు మరణం తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.