బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (12:21 IST)

పాప్ సింగర్‌ మేటా గవదను కాటేసిన పాము...

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. ఆయన తన ఫామ్ హౌస్‌లో ఉండగా, ఓ పాము కాటేసింది. ఇపుడు ఇలాంటి ఘటనే ఒకటి మరొకటి జరిగింది. అమెరికా పాప్ సింగర్ మేటా ఓ మ్యూజిక్ వీడియో షూట్ చేస్తున్న సమయంలో పాము ఒకటి ఆమెను కాటేసింది. పాముకాటుకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆమ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
21 యేళ్ల పాప్ సింగర్ మేటా.. ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం కార్పెట్‌పై పడుకునివుండగా, ఆమె చుట్టూత సర్పాలు చేరివున్నాయి. నలుపు దుస్తుల్లో ఉన్న ఆ సింగర్ తన ఒంటిపై పాముని వేసుకుంటుంది. మరికొన్ని పాములు ఆమె శరీరంపై పాకుతుంటాయి. దీన్ని వీడియో షూట్ చేస్తున్న సమయంలో ఓ పాము ఆ సింగర్ గవదను కాటేసింది. 
 
పాము కాటుతో ఉలిక్కిపడిన ఆమె... చేతిలోని పామును పక్కకు విసిరేసింది. ఇదంతా కెమెరాకు చిక్కుకుంది. ఈ ఘటన తర్వాత ఆమె స్పందిస్తూ, ఇకపై ఇలాంటి షూట్‌లు ఎపుడు చేయబోనని స్పష్టం చేశారు. అయితే, షూటింగ్ కోసం ఉపయోగించిన పాములకు దంతాలు పీకేసి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పైగా ఇది విషపు సర్పం కాదని ఆమె తెలిపారు. ఈ వీడియోకు ఇప్పటికే 4.50 లక్షల వ్యూస్ వచ్చాయి.