శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (11:59 IST)

స‌ల్మాన్ ఖాన్‌కు చిరంజీవి శుభాకాంక్ష‌లు - కొత్త చిత్రం టైటిల్ ప్ర‌క‌టించిన స‌ల్మాన్‌

Venky- Salman
స‌ల్మాన్ ఖాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈరోజు టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్ వంటి హీరోలు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. స‌ల్మాన్‌తో వున్న ఫొటోను వెంక‌టేష్ పోస్ట్ చేయ‌గా, చిరంజీవి శుభాకాంక్ష‌లు ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.
 
మై డియర్ సల్లూ భాయ్ !!!!
మంచి మనుషులు ఎప్పుడూ ఇతరులకు మంచి చేయాలని ఆలోచిస్తారు.
భగవంతుడు మీలాంటి మంచి ఆత్మను ఎల్లప్పుడూ జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా మరియు సంపన్నంగా ఉంచాలి. గోల్డెన్ హియర్‌తో ఎప్పటికీ యువ సూపర్‌స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు.
 
ఇదిలా వుండ‌గా,  ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.  ప్రేక్షకులకు సరైన ట్రీట్ ఇచ్చాడు. తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “భజరంగి భాయిజాన్” సీక్వెల్ టైటిల్‌ను వెల్లడించాడు. సల్మాన్ ‘భజరంగీ భాయిజాన్ 2’ కోసం రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పని చేయడం గురించి ప్రస్తావించాడు. దాని గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి ‘పవన్ పుత్ర భాయిజాన్’ అని పేరు పెట్టినట్లు పేర్కొన్నాడు. ‘టైగర్ 3’ త‌ర్వాతో మ‌రో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి. అవి పూర్త‌య్యాక సీక్వెట్ వుంటుంద‌ని తెలిపారు.