బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (17:53 IST)

టాలీవుడ్ హీరోయిన్ - కోలీవుడ్ హీరోకు కరోనా పాజిటివ్

తెలుగు తమిళ చిత్రపరిశ్రమలకు చెందిన ఇద్దరు నటీనటులకు కరోనా వైరస్ సోకింది. వీరిలో ఒకరు హీరోయిన్ మీనా కాగా మరొకరు తమిళ నటుడు అరుణ్ విజయ్. ఈ విషయాన్ని వారు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. హీరోయిన్ మీనా ఒక్కరే కాదు.. ఆమె కుటుంబ సభ్యులంతా ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. 
 
"కొత్త సంవత్సరం మా ఇంట్లోకి అనుకోని అతిథిలా మిస్టర్ కరోనా వచ్చింది. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటుఇవ్వను. ప్రజలారా అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు చోటివ్వండి" అంటూ ట్వీట్ చేశారు. 
 
అలాగే, కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కూడా ఈ వైరస్ బారినపడినట్టు బుధవారం తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు. "తనకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటూ స్వీయ రక్షణ చర్యలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.