1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (08:31 IST)

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు కోవిడ్ పాజిటివ్

అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు కరోనా వైరస్ సోకింది. గత రెండు మూడు రోజులుగా జలుబు, దగ్గు వంటి లక్షణాలు గత రెండు రోజులుగా కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఐదు రోజులపాటు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, తాను రెండు డోసుల వ్యాక్సిన్‌తో పాటు గత అక్టోబరులో బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నట్టు చెప్పారు. అయినప్పటికీ ఆయన కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు. 
 
ఇదిలావుంటే, అమెరికాలో ఇప్పటివరకు 5,61,42,175 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 87,47,408 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. 4,15,43,060 మంది కోలుకున్నారు. దేశంలో ఇంకా మరో 1,37,51,707 యాక్టివ్ కేసులు ఉన్నాయి.