సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (16:20 IST)

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు కరోనా పాజిటివ్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈయన "పాగల్" చిత్రంలో హీరోగా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తనకు వైరస్ సోకినట్టు ఆయన వెల్లడించారు. దీనిపై ఆయన ఓ ప్రకటన చేశారు. 
 
"ఇటీవలే నాకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుంత తాను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వైద్యులు సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఈ వైరస్ దావనంలా వ్యాపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు" అని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, ఇటీవల మరో హీరో మంచు మనోజ్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.