బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (12:21 IST)

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యువ హీరో మంచు మనోజ్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచు మనోజ్ పేర్కొన్నారు. 
 
అదేసమయంలో ఇటీవల తనను కలిసినవారు విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచన చేశారు. అలాగే, ఒక్క కరోనా పట్లే కాకుండా ఒమిక్రాన్ వైరస్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. 
 
"నా గురించి ఆందోళన అక్కర్లేదు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలే నా బలం. కరోనా సమయంలో జాగ్రత్తగా చూసుకుంటున్న వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు చెబుతున్నాను" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.