శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (19:55 IST)

ఓరి దేవుడా మోషన్ పోస్టర్.. విజయ్ సేతుపతి పాత్రలో స్టార్ హీరో

Ori Devuda
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. 
 
తమిళ్‌లో క్లాసిక్ లవ్ స్టోరీగా ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ ‘ఓ మై కడవులే’.. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ లీడ్ రోల్స్ చెయ్యగా.. విజయ్ సేతుపతి కీలక పాత్ర క్యారెక్టర్ చేశారు. ఈ సినిమానే తెలుగులో ‘ఓరి దేవుడా’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
 
రీసెంట్‌గా టైటిల్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అయిన హీరో, హీరోయిన్ లవ్ మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకుల కోసం కోర్టుకెళ్లడం, చివరకు వాళ్లు విడిపోయారా.. తిరిగి ఒక్కటయ్యారా? అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ‘ఓ మై కడవులే’ తమిళనాట సూపర్ హిట్ అయ్యింది. 
 
స్టోరీ నేరేషన్ విజయ్ సేతుపతి పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. ఆ క్యారెక్టర్‌లో ఓ స్టార్ హీరో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది.