పెయింట్ డబ్బా మీద భార్య పడిందన్నాడు.. కానీ సుత్తితో తలపై కొట్టాడు.. కూతుళ్లు?
కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల సంబంధాలు నేరాలకు దారితీస్తున్నాయి. ఒకవైపు వివాహేతర సంబంధాలు.. మరోవైపు క్షణికావేశాలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా దంపతుల మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తిని హంతకుడిని చేసింది. భార్యను భర్త సుత్తెతో కొట్టి చంపిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డికి చెందిన దంపతులు రోజూ గొడవపడేవారు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో కోపంతో రగిలిపోయిన భర్త సుత్తె తీసుకొని భార్య తలపై కొట్టాడు. భార్యపై తలపై పెయింట్ డబ్బా పడడంతో గాయపడిందని అందరినీ నమ్మించాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో యశోద ఆస్పత్రికి తరలించాడు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. తండ్రి ప్రవర్తనపై కూతుళ్లకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
