ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:20 IST)

విడుద‌ల‌య్యాక చిన్న సినిమాలు పెద్దవి అవుతాయి - విశ్వక్ సేన్

Netho teaser function
అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ జంటగా నటిస్తున్న ఎంటర్‌టైనర్ `నీతో`. ఏవిఆర్ స్వామి, ఎమ్ఆర్ కీర్తన, స్నేహాల్ జంగాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాలు శర్మ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. లవ్ లైఫ్ డ్రామాగా నీతో టీజర్ ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ అంశాలతో ఈ టీజర్ కట్ చేసారు దర్శక నిర్మాతలు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది. టీజర్‌లో మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న నీతో సినిమాకు మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సుందర్ రామ్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల అవుతుంది.
 
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, టీజర్ నాకు బాగా నచ్చింది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అమేజింగ్, ద‌ర్శ‌కుడు బాలు `ఈ నగరానికి ఏమైంది` కి ప‌నిచేశాడు. పవిత్రలోకేష్ `దియా`లో నటనకి నా కళ్ల నుంచి నీళ్లు వచ్చాయి, మాది చిన్న సినిమా అని ద‌ర్శ‌కుడు అంటున్నాడు సినిమా రిలీజ్ అయ్యాక చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతాయి,  మొదట్లో అభిరామ్ నేను కలిసి అవకాశాలు కోసం తిరిగేవాళ్ళం. ఈ సినిమా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు.
 
చిత్ర నిర్మాత  ఏవిఆర్.స్వామి మాట్లాడుతూ, `రాహు` అనే మూవీ నిర్మించా, బాలుతో ఒక సినిమా చేశాను, ఇప్పుడు నీతో చేస్తున్నాను, ఈ సినిమా తప్పకుండా మీ ఆదరణ పొందుతుందని తెలిపారు.
 
పవిత్ర లోకేష్ మాట్లాడుతూ, సినిమా తీయటం ఒక వ్యాపారం లాంటిది. బాలు శర్మ సెట్లో అంత క్లియర్ గా వుండేవాడు. అభిరామ్ పెద్ద హీరో అవుతాడు, ఇప్పుడు  మంచి సినిమాలు చేసుకుంటూ పొతే స్మాల్ బడ్జెట్ అనేది నో  మేటర్ అని చెప్పారు.
 
స్నేహాల్ తెలుపుగూ, `నీతో`ఒక మెట్రో సెక్షన్ లవ్ స్టోరీ. అన్ని ఎమోషషన్స్ ఉంటాయి, ఇది నాకు, మా వైఫ్ కీర్తన కి ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది రొటీన్ గా వుండే సినిమా కాదు మీ అందరికి సినిమా నచ్చుతుందని అన్నారు.
 
ద‌ర్శ‌కుడు బాలు మాట్లాడుతూ, వివేక్ సాగర్ సంగీతం, సినిమాటోగ్రాఫ‌ర్ సుందర్ ప‌నిత‌రం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. క‌థ ఇప్ప‌టి త‌రానికి సంబంధించింది. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంద‌ని పేర్కొన్నారు. ఇంకా అభివర్మ, సిమ్రాన్ చౌదరి, సంజిత్ మాట్లాడుతూ, చిత్రం విజ‌య వంతం కావాల‌ని ఆకాంక్షించారు.