మూసిన థియేటర్లను ఓపెన్ చేపిస్తా.. తప్పైతే నా పేరు మార్చుకుంటాః విష్వక్‌సేన్
విష్వక్‌సేన్ హీరోగా దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగల్`.నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్స్‌గా నటించారు. సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు అతిథులు పాల్గొని విజయవంతం కావాలని కోరుకున్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, కోవిడ్ వచ్చిన తర్వాత కూడా తెలుగు సినిమాలు రిలీజయ్యి వకీల్‌సాబ్ వరకూ కంటిన్యూ అయ్యాయి. అందుకు తెలుగు ప్రేక్షకులకి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత కూడా తెలుగు సినిమాలే విడుదలవుతున్నాయి. చాలా హ్యాపీ.ఇంత మంది యంగ్ హీరోస్ ఈ ఈవెంట్ కి రావడం చాలా మంచి విషయం. ఈ కథ వినగానే కొత్తగా అనిపించి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటరవ్వడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ప్రమోషన్స్‌ని తన బుజాలమీద వేసుకుని మరీ విశ్వక్ చేశాడు. విశ్వక్ ని చూసి ప్రొడ్యూసర్‌గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అని తెలిపారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, నేను మధ్యాహ్నం ఈ సినిమా చూశాను. అందుకే సక్సెస్ మీట్ అంటున్నా. నేను నా లైఫ్‌లో చాలా మందిని లవ్ చేసా అంటారు. కానీ దానికి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా? ముందు అందంగా ఉందో లేదో చూస్తారు. డబ్బును చూస్తారు. ఆ తర్వాత మన కులమా కాదా అని చూస్తారు. ఇలా చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తారు. కానీ ఇవేమి లేకుండా ప్రేమించే వాడే ప్రేమ్. తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీనే ఈ పాగల్.
ఈ సినిమాను దిల్ రాజు మేము రూ 5లో తీద్దాం అనుకుందాం. కానీ రాజుగారు పది మెట్లు ఎక్కించారు. నరేశ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాము. బెక్కం వేణుగోపాల్, డైరెక్టర్, నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాం. హీరోయిన్స్ అందరూ చాలా బాగా చేశారు. మాములుగా శుక్రవారం మూవీస్ రిలీజ్ చేస్తారు. కానీ మేము పాగల్ కదా. అందుకే శనివారం రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజున పార్టీలు, పబ్‌లలోనే కాదు. థియేటర్లలో కూడా జరుగుతాయి. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‌లో సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వచ్చే ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేపిస్తా, తప్పైతే నా పేరు మార్చుకుంటా. ఇండిపెండెన్స్ డే ఆగస్ట్15 కాని సినిమా థియేటర్స్‌కి ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14`` అన్నారు.
చిత్ర దర్శకుడు నరేశ్ కుప్పిలి మట్లాడుతూ, దిల్‌రాజు ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంటరైన దగ్గరనుండి ఈ సినిమా స్పాన్ పెరిగింది. ఆ బ్యానర్‌లో నా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ. విశ్వక్ స్టోరీ వినగానే షేక్ హ్యాండ్ ఇచ్చి మనం సినిమా చేస్తున్నాం అని చెప్పారు. విశ్వక్ కెరీర్‌లో బెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది` అన్నారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - దిల్‌రాజుగారు ఇచ్చిన ధైర్యంతో రిస్క్ అయినా సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. నేను గర్వపడే, మీరు ఇష్టపడే సినిమా చేశాను అని అనుకుంటున్నా అన్నారు. ఇంకా హీరో తేజ సజ్జ, హీరోయిన్ నివేదా పేతురాజ్, మేఘ లేఖ, సిమ్రాన్ చౌదరి, హీరో కార్తికేయ, హీరో శ్రీ విష్ణు తదితరులు మాట్లాడారు.