సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (09:13 IST)

పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్ - ఆస్పత్రిలో చేరిక

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి కరోనా వైరస్ పాజిటివ్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తనతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సంక్రమించిందని, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామన్నారు. 
 
కరోనాతో ఆసుపత్రిలో చేరడంతో తాను నటిస్తున్న రెండు సినిమాల షూటింగులు వాయిదా పడినట్టు తెలిపారు. తన కారణంగా ఇబ్బందులకు గురైన దర్శక నిర్మాతలు, హీరోలు క్షమించాలని కోరారు. అందరి ఆశీస్సులతో త్వరలోనే కరోనా నుంచి కోలుకుని బయటపడతానని పోసాని ధీమా వ్యక్తం చేశారు.