1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (06:59 IST)

నేను పెళ్లి చేసుకోవ‌డం ఏమిటి? అంటున్న సుమంత్‌

Sumanth
న‌టుడు సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు గ‌త మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దానితో రామ్‌గోపాల్‌వ‌ర్మ కూడా వ్యంగంగా ట్వీట్ చేశాడు. ఆయ‌న అన్న‌ట్లే నిజ‌మైంది. అస‌లు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? అంటూ క్లారిటీ ఇచ్చాడు. అస‌లు వెడ్డింగ్ కార్డ్ నాపేరుతోనే వుంది. అయితే అది అస‌లు పెళ్లికాదు. సినిమా పెళ్లి అంటూ వివ‌రించారు. 
 
వెడ్డింగ్ కార్డ్‌లో ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు బయటకు రావడమే. క‌నుక నేను ఇప్ప‌టికైనా క్లారిటీ ఇవ్వాల‌ని సుమంత్ నిర్ణ‌యించుకుని ఇలా ఇచ్చాడు. నేను అసలు రెండో పెళ్లి చేసుకోవడంలేదు. బయట సర్క్యులేట్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ నేను నటిస్తున్న ఓ లేటెస్ట్ చిత్రంలోనిదని, అది లీక్ కావడం వలనే తన రెండో పెళ్లిపై రూమర్స్ పుట్టుకొచ్చాయని అన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్ చెప్పుకొచ్చాడు. సినిమా పెళ్లిని ఇలా చిత్ర యూనిట్ ప‌బ్లిసిటీగా వాడుకుంద‌న్న‌మాట‌. మ‌రి ఈ విష‌యం సుమంత్‌కు తెలిసే జ‌రిగింద‌ని యూనిట్ చెబుతోంది.