మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (17:19 IST)

సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను హీరో తీరుస్తుంది - ఆదిశేషగిరి రావు

Adiseshagiri Rao, Galla Jayadev, Galla Padmavati, Sriram Aditya, Nidhi Agarwal, Ashok Galla,
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు ,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్  ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్  ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.
 
ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ,  సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనళ్లుడిగా ఇవాళ సినీ పరిశ్రమకు అశోక్ వచ్చారు. కృష్ణ గారి పచ్చని సంసారంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. అప్పటి నుంచే నటించాలనే కోరిక పుట్టినట్టుంది. అందరూ సహకరించి.. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను పెట్టారు. సినిమాలో చిన్న చిన్న గ్లింప్స్ చూశాను. స్టార్స్‌కు ఉండాల్సిన లక్షణాలున్నాయి. డ్యాన్స్, యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, సెన్సాఫ్ హ్యూమర్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ ఉన్నాయి. మాస్ హీరోకు ఉండే లక్షణాలన్నీ కూడా పునికిపుచ్చుకున్నాడు. ఆదిత్య అద్భుతంగా తెరకెక్కించాడు. కాన్ఫిడెంట్‌గా సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. 
 
టికెట్ రేట్ల అంశం గురించి కావాలంటే ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి మాట్లాడతాను. ఈ సినిమాకు సంబంధించి కృష్ణ గారు జనవరి 15న వెళ్తే బాగుంటుందని అన్నారు. నెలక్రితమే ఆ విషయం చెప్పారు. కానీ పెద్ద సినిమాలున్నాయ్ ఎలా? అని పద్మావతి, మేం అనుకున్నాం. అందరూ కలిసి ఈ సినిమాను జనవరి 15న తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఓటీటీ, సోషల్ మీడియా ఎలా ఎన్ని వచ్చినా కూడా సినిమా ఎప్పుడూ సినిమానే. థియేటర్లో సినిమాను చూస్తేనే ఆ అనుభూతి వస్తుంది. అవి ఎప్పటికీ ఉంటాయి. ఓటీటీకి వెళ్దామనే ఆలోచనలు వచ్చినా కూడా ఆపాం. ఇలాంటి సినిమాలను థియేటర్లోనే చూడాలి. సినిమాలో కంటెంట్ ఉంటే సంక్రాంతికి రెండు మూడు చిత్రాలు వచ్చినా కూడా నిలబడతాయి. అందుకే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నాం. సంక్రాంతికి సినిమాలు లేవనే కొరతను తీర్చేందుకు ఈ సినిమా రాబోతోంది’ అని అన్నారు.
 
గల్లా జయదేవ్ మాట్లాడుతూ, ఈ బ్యానర్‌ను కేవలం అశోక్ కోసమే పెట్టాం. నా రెండో కొడుకు సిద్దార్థ్‌కి కూడా సినిమా మీదే ఆసక్తి ఉన్నట్టుంది.  మొదటి సినిమా కోసం పద్మావతి ఎక్కువగా కష్టపడింది. అశోక్‌కి చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రెండు సినిమాల్లో నటించాడు. సింగపూర్, టెక్సాస్‌లో కూడా నటన మీదే కోర్సులు చేశాడు. సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని అశోక్ దగ్గరుండి చూసుకున్నాడు. ఇక నేను కూడా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే ఇలా బ్యానర్ పెట్టాను. కానీ నటుడిగా మాత్రం సినిమాలు చేయను. నేను రాజకీయ నాయకుడిని, వ్యాపారవేత్తను మాత్రమే. నాకు నటనలో ఆసక్తి లేదు. ఈ బ్యానర్, సినిమా పనుల్లో పద్మావతి పాత్రే ఎక్కువగా ఉంది. సిద్దార్థ్, అశోక్ మున్ముందు ఈ బ్యానర్‌ను ఎంత వరకే తీసుకెళ్తారనేది వారిష్టం.’ అని అన్నారు.
 
పద్మావతి గల్లా మాట్లాడుతూ.. ‘డిస్ట్రిబ్యూటర్లంతా కూడా సాయం చేస్తున్నారని మా బాబాయ్ ఆదిశేషగిరి రావు చెప్పారు. అందుకే సినిమా ఇంత తక్కువ టైం ఉన్నా కూడా విడుదల చేస్తున్నాం. పండుగకు సినిమాలు చూసే ఆనవాయితీ ఉందని, నాగార్జున గారు కూడా వస్తున్నామని ప్రకటించారు. అందుకే మేం కూడా ధైర్యం చేసి సినిమాను జనవరి 15న తీసుకురాబోతోన్నాం. మా అశోక్‌ను, అతని టాలెంట్‌ను అందరికీ చూపించబోతోన్నాం. నిధి చక్కగా నటించింది. వారిద్దరి జోడి బాగుంది. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాలో అశోక్‌ను చూస్తుంటే నాన్న గారే ఎక్కువగా గుర్తొచ్చారు. యాక్షన్ సీక్వెన్స్‌లో అయితే మహేష్ కనిపించాడు’ అని అన్నారు. ’ అని అన్నారు.
 
నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘అశోక్‌కి ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించాడు. చాలా బాగా డ్యాన్స్ చేశారు. మొదటి సినిమాలా ఎక్కడా అనిపించదు. ప్రతీ ఒక్క ఎమోషన్‌ను అద్బుతంగా పోషించారు. శ్రీరామ్ ఆదిత్య గారు ఎంతో పర్ఫెక్షన్‌తో తీశారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.
 
డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ,  ఈ కథకు కొత్త హీరో అయితే బాగుంటుందని అనుకున్నాను. ఓ సారి అశోక్‌ను కలిశాను. కథను వినిపించడంతో అశోక్ ఎగ్జైట్ అయ్యాడు. కౌ బాయ్ ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా మీరు సినిమాలో చూడాల్సిందే. అందరికీ నచ్చుతుంది. కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫస్ట్ సినిమా కదా? అని హీరో టైటిల్ పెట్టలేదు. మేం ఎంత పాజిటివ్‌గా ఈ సినిమా తీశామో.. మీకు అర్థమవుతోంది. విజిల్ వేసే సీన్స్ ఇందులో ఉంటాయి. పండుగ సినిమా అంటే.. పర్ఫెక్ట్ పండుగ సినిమాతోనే వస్తున్నాం. నిధి, అశోక్ కలిసి ఓ మాస్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. త్వరలోనే ఆ పాటను విడుదల చేస్తాం. సినిమాను చూస్తే అందరికీ పండుగ ఫీలింగ్ వస్తుంది’ అని అన్నారు.
 
అశోక్ గల్లా మాట్లాడుతూ.. ‘నా కల నిజమవుతున్నట్టు అనిపిస్తోంది. సంక్రాంతికి రాబోతోన్నామని తెలిసినప్పటి నుంచి మా ఎనర్జీ వేరే లెవెల్‌కి వెళ్లింది. పాటను రిలీజ్ చేశాక.. తాతగారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, నార్మల్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సినిమాను పండుగకు తీసుకురావాలని అనుకున్నాం. మేం ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమాను తీశామో.. ఆడియెన్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తే మా టార్గెట్ రీచ్ అయినట్టే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించినప్పుడే నాకు నటన మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడిని తీసుకోలేదు. కానీ విడుదల రోజు మాత్రం ప్రెజర్ ఉంటుంది. ఈ సినిమాలో కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఎలాంటి ప్రత్యేక పాత్రలో కనిపించరు’ అని అన్నారు.