గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (16:11 IST)

అశోక్ గల్లా హీరో చిత్రం నుంచి డోనల్ డగ్గు ర్యాప్ సాంగ్

Hero - Ashok Galla
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ మెంబర్ అశోక్ గల్లా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న సినిమా హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి పండక్కి ఈ నెల 15న థియేటర్ లలో విడుదల కాబోతోంది హీరో సినిమా. ఈలోగా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా సినిమాలో ర్యాప్ సాంగ్ డోనల్ డగ్గును రిలీజ్ చేశారు.
 
టాలెంటెడ్ మ్యుజీషియన్ జిబ్రాన్ జోష్ ఇచ్చే బీట్ తో ఈ ర్యాప్ సాంగ్ కంపోజ్ చేశారు. రోల్ రైడా సాహిత్యాన్ని అందించడంతో పాటు ఎనర్జిటిక్ గా పాడాడు. ఊరు వాడా చూడు ఈడ, అన్న గేమ్ హల్చ లుంది..పెంచమంది కిర్రాకునే.. జిల్లా మొత్తం ఊగిపోద్ది గల్లా ఎత్తి...అంటూ ఫుల్ మాస్ బీట్ తో సాగుతుందీ పాట.
 
అశోక్‌ గల్లాను కంప్లీట్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసేందుకు అన్ని కమర్షియల్ ఎలిమంట్స్ హీరో  చిత్రంలో చేర్చారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ ర్యాప్ సాంగ్ లో అశోక్ గల్లా డాన్సింగ్ టాలెంట్ ప్రేక్షకులు చూడబోతున్నారు. చిరంజీవి స్టెప్స్, రజినీకాంత్ స్టైల్, బాలకృష్ణ ఫెరోషియస్ నటన, వెంకటేష్ క్లాస్ లుక్స్..ఇ‌వన్నీ డోనల్ డగ్గు పాటలో చూపించడం సరికొత్త కాన్సెప్ట్ గా ఆకట్టుకుంటోంది. జనవరి 15న ఈ పాట థియేటర్లను ఊపేయడం ఖాయమని చెప్పొచ్చు.
 
నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య