మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By డీవీ
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (14:34 IST)

సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం నాగార్జున సినిమా గురించే మారిందా?: నాగ్‌తో వెబ్‌దునియా ప్రత్యేక ఇంటర్వ్యూ

Akkineni Nagarjuna
ఇటీవ‌లే సినిమారంగంలో సినిమా టిక్కెట్ల రేట్ల గురించి ప‌లువురు ప‌లుర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫైన‌ల్‌గా రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా కామెంట్లు చేసి వార్త‌ల్లోకి ఎక్కాడు. దీని వెనుక నాగార్జున వున్నాడేమో అని కొంద‌రు అనుకున్నారు. మ‌రి నాగార్జున సినిమా రంగం గురించి అడిగిన ప్ర‌శ్న‌ల‌కు గురువారంనాడు ఈ విదంగా స‌మాధానం చెప్పారు.
 
సంక్రాంతికి ష‌డెన్‌గా బంగార్రాజు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కార‌ణం?
బంగార్రాజు సినిమా చేస్తున్న‌ప్పుడే సంక్రాంతికి రావాల‌ని పండుగ లాంటి సినిమా అని ఫిక్స్ అయి షూటింగ్ చేశాం. కోవిడ్ వ‌ల్ల ఇబ్బంది క‌లుగుతుంద‌ని అనుకున్నా. కొద్దిరోజులు అలా ప‌డ్డాం. ఫైన‌ల్‌గా ముందు అనుకున్న‌విధంగా టెక్నీషియ‌న్స్ త‌మ ప‌ని చేయ‌డంతో సంక్రాంతికి రావాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం.

 
జ‌న‌వ‌రి 14 అని ప్ర‌క‌టించిన రోజునే ఎ.పి.లో టికెట్ల రేట్లు త‌క్కువ‌గానే వున్నాయి క‌దా, ఏ ధైర్యంతో ముందుకు వ‌చ్చారు?
మేము పెట్టిన బ‌డ్జెట్ మాకు త‌గిన‌విధంగా చేశాం. మా బ‌డ్జెట్‌కు లోబ‌డి సినిమా తీశాం. దాని వ‌ల్ల టిక్క‌ట్ల రేట్లు త‌గ్గించినా ఇబ్బందిలేదు అని అప్పుడు చెప్పాను. తెలంగాణ‌లో ఎలాగూ ప్ర‌భుత్వం స‌పోర్ట్‌గానే వుంది క‌నుక రెండు చోట్ల బేరీజువేస్తే మా సినిమాకు సేఫ్ క‌లెక్ష‌న్లు వ‌స్తాయ‌ని అనుకున్నాం. ఒక‌వేళ ఎ.పి. ప్ర‌భుత్వం రేట్లు పాత‌వి అంటే అదంతా మాకు బోన‌స్‌గా భావించాం.

 
విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన‌ప్పుడే టెన్ష‌న్‌గా వున్నాన‌ని అన్నారు. కానీ మీ సినిమాకు అనుకూలంగానే వై.ఎస్‌. జ‌గ‌న్ కర్ఫ్యూను కూడా ఎత్తేసి, ఫుల్ ఆక్యుపెన్సీ అని ప్ర‌క‌టించారు. ఇది మీకు ముందే తెలుసా?
(న‌వ్వుతూ) నా ఒక్క‌డి కోసం జ‌గ‌న్‌గారు నిర్ణ‌యం తీసుకోరు. అంద‌రిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణ‌యం ఇది. పైగా సంక్రాంతి పండుగ బాగా జ‌రుపుకుంటారు మ‌న తెలుగువాళ్ళు. ఇలాంటి టైంలో అటువంటి నిర్ణ‌యం స‌రైంది కాద‌ని ఆయ‌న అనుకున్నారేమో. ఏదైనా అన్ని సినిమాల‌కు మంచి జ‌రిగింది క‌దా.

 
ఒక‌వేళ నా ఒక్క‌డి గురించే జ‌గ‌న్ గారు నిర్ణ‌యం తీసుకున్నార‌నుకుంటే, మ‌హారాష్ట్రలోనూ కూడా ఒక‌రోజు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నిర్ణ‌యం మ‌రో రోజు మారిపోయింది. ఈ విష‌యం గ‌మ‌నించాలి. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు సంద‌ర్భానుసారం మారుతుంటాయి.

 
చిరంజీవిగారు జ‌గ‌న్‌గారిని క‌ల‌వ‌డానికి వెళ్ళారు? ముందుగానే మీరు మాట్లాడుకున్నారా?
చిరంజీవిగారు నెల‌ముందు ఇలా వెళుతున్నా అపాయింట్‌మెంట్ తీసుకుంటున్నా అన్నారు. ఆయ‌న వెళుతున్న‌ట్లు తెలుసు. అందిరి బాగు గురించి మాట్లాడ‌డండి అని అనుకున్నాం. కొద్ది గంట‌ల్లో జ‌గ‌న్ గారు వివ‌రాలు తెలుస్తాయి.